Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాదులోని మాదాపూర్ లో స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తన్న కుమారి ఆంటీ ఇప్పుడు ఫేమస్ అయ్యింది. ఆమె స్టాల్ వద్దకు సినీ ప్రముఖులు కూడా వచ్చి తినడం వల్ల ఎంతో ఫేమస్ గా మారింది.

Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

హైదరాబాద్ , మన సాక్షి :

ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాదులోని మాదాపూర్ లో స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తన్న కుమారి ఆంటీ ఇప్పుడు ఫేమస్ అయ్యింది. ఆమె స్టాల్ వద్దకు సినీ ప్రముఖులు కూడా వచ్చి తినడం వల్ల ఎంతో ఫేమస్ గా మారింది. దాంతో ట్రాఫిక్ పెరిగిపోతుందని ఇటీవల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి స్ట్రీట్ ఫుడ్ వాహనాన్ని తీసుకెళ్లారు.

దాంతో సోషల్ మీడియా లో ఆమెకు సపోర్టుగా కథనాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను యధావిధిగా కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తాను కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ సందర్శించనున్నట్లు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.

ఆమె ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలని యోచన విరమించుకోవాలని, యధావిధిగా ఫుడ్ స్టాల్ నిర్వహణకు అధికారులు చొరవ చూపాలని అధికారులు ఆదేశించారు. దాంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయ్యింది.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!