పేకాట రాయుళ్ల పై పంజా విసిరిన ఎస్వోటీ పోలీసులు, ఐదుగురి అరెస్ట్

పేకాట రాయుళ్ల పై పంజా విసిరిన ఎస్వోటీ పోలీసులు, ఐదుగురి అరెస్ట్

వలిగొండ , మన సాక్షి:

వలిగొండ మండలం లోని వెంకటాపురం గ్రామ పరిధిలోని వేములకొండ దేవస్థానం వద్ద మెట్ల దారి కి సమీపాన పేకాట ఆడుతున్న ఓ ఐదుగురు పేకాట రాయుళ్ళను ఎస్ ఓ టి పోలీసులు పథకం ప్రకారం పట్టుకున్నారు.

పట్టుబడిన వారి నుండి 81 వేయి 40 రూపాయల నగదు,ఒక ప్లేయింగ్ కార్డ్ సెట్ తో పాటు ఐదు సెల్ ఫోన్స్ రెండు కార్లు స్వాధీన పరుచుకున్నమని ఎస్ఓటి పోలీసులు తెలియజేశారు.

అదేవిధంగా జిల్లాలో ఎవ్వరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.