PM Kissan: పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఎకౌంట్లోకి రావాలంటే ఇవి ఉన్నాయేమో చూసుకోండి..!

PM Kissan: పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఎకౌంట్లోకి రావాలంటే ఇవి ఉన్నాయేమో చూసుకోండి..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా అందించేందుకు పీఎం కిసాన్ స్కీం కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా డబ్బులను రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేసింది. ఇక 14వ విడత డబ్బులను కూడా జమ చేయడానికి సిద్ధమవుతుంది.
మూడు విడతల్లో రైతుల ఖాతాలో డబ్బులు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతగా ఏప్రిల్ నుంచి జూలై వరకు 2000 రూపాయలు, రెండవ విడతలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు 2000 రూపాయలు, మూడవ విడతలో డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో రెండు వేల రూపాయలు అందుతాయి . అయితే ప్రస్తుతం తొలి విడతలో డబ్బులు ఎకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
చెక్ చేసుకోండి ;
కాగా రైతులు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా ..?రావా..? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. దీనికోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ బెనిఫిషరీ లిస్టు ఉంటుంది . దాని ద్వారా వివరాలు తెలుసుకోవచ్చును. అంతే కాకుండా కొత్తగా పిఎం కిసాన్ స్కీమ్ లో చేరకపోతే వెంటనే చేరవచ్చును. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి పథకంలో జాయిన్ కావచ్చును. రేషన్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్, వ్యవసాయ పొలం పట్టా, ఆధార్ కార్డు వివరాలు కావలసి ఉంది. ఆధార్ కార్డు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా రైతు ఖాతాలలోకి 26 వేల రూపాయలను ఉచితంగా జమ చేసింది. 14వ విడత 2000 రూపాయలను సహాయం చేయడానికి సిద్ధమైంది. కాగా ఈనెలాఖరులోగా కానీ, జూలై మొదటి వారంలో కానీ నేరుగా ఖాతాలలోకి వచ్చే అవకాశం ఉంది. రైతులు వెబ్ సైట్ లోకి వెళ్లి చూసుకునే అవకాశం కూడా ఉంది.