Jagithyal : గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..!

గుడుంబా రహిత జిల్లాగా జగిత్యాల ను చూడాలనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు,ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది.

Jagithyal : గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..!

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)

గుడుంబా రహిత జిల్లాగా జగిత్యాల ను చూడాలనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు,ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దాడిలో 6 లీటర్ల గుడుంబాను90 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాని ధ్వంసం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గుడుంబాకు అలవాటు పడి ఎంతోమంది కుటుంబాలను చిన్నబిన్నం చేసుకొని చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.

అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన, అమ్మిన వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.ఈ యొక్క తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం ఎస్.ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!