Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మిర్యాలగూడ : పోలీస్ తనిఖీలలో రూ. 5. 73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..!
మిర్యాలగూడ : పోలీస్ తనిఖీలలో రూ. 5. 73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..!
మిర్యాలగూడ , మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసుల తనిఖీలు విస్తీతంగా చేపడుతున్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద పోలిస్ తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ లు 5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మిర్యాలగూడ నుండి కోదాడ వెళ్తున్న బొలేరు వాహనంలో 13 కిలోల దారం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలలో బంగారం తరలిస్తున్నట్లుగా తేలడంతో స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా రూ. 5.73 కోట్లు ఉంటుందని అంచనా.
ALSO READ :
BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









