మిర్యాలగూడ : పోలీసుల తనిఖీలు.. రూ 3.5 లక్షలు సీజ్

మిర్యాలగూడ : పోలీసుల తనిఖీలు.. రూ 3.5 లక్షలు సీజ్

మిర్యాలగూడ , మన సాక్షి

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మిర్యాలగూడలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో 3.5 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని చర్చ్ బజార్ రోడ్‌లో వాహన తనిఖీలు నిర్వహించారు. హనుమాన్ పేట కు చెందిన ఒక్క శ్రీనివాస్ రంగారావు ఎలాంటి సరైన పత్రాలు లేకుండా రూ.3.5 లక్షలు కలిగి ఉన్నారు. పోలీసులు సీజ్‌ చేసి పంచనామా నిర్వహించారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!