Suryapet : పోలీసులకు పదోన్నతి..!

Suryapet : పోలీసులకు పదోన్నతి..!
సూర్యాపేట, మనసాక్షి :
ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయని వాటికి అనుగుణంగా సేవా చేస్తూ ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. ఆర్ముడ్ రిజర్వ్ నందు కానిస్టేబుల్స్ గా పని చేస్తున్న కె.వీరబాబు, కె.మహేష్, బి.జానయ్య లు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందారు.
ఈమేరకు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ప్రమోషన్ పొందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ లకు ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలు కు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏ ఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి,ఏ ఆర్ డీస్పీ నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, ఆర్ ఎస్ ఐ లు సురేష్, ఎం.అశోక్, కే.అశోక్, అన్వర్, సాయిరాం, ఏ ఆర్ సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Crypto currency : నకిలీ క్రిప్టో కరెన్సీ.. మాజీ కార్పొరేటర్ అరెస్ట్..!
-
District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!
-
Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!
-
Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!









