BREAKING : పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. ఏడుగురు అరెస్టు..!
BREAKING : పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. ఏడుగురు అరెస్టు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఏడుగురు పేకాటరాయుళ్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి మండల ముర్కుంజాల్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పేకాడుతూన్నట్లు పోలీసులకు సమాచార మందింది.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.20 వేలు , ఐదు బైకులు, ఐదు సెల్ ఫోన్లు పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ALSO READ :
Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!
బాలెంల డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో లభ్యమైన బీరు సీసాలు..!









