వేములపల్లి : పోలీసుల తనిఖీలు.. కారులో నగదు సీజ్..!

వేములపల్లి : పోలీసుల తనిఖీలు.. కారులో నగదు సీజ్..!

వేములపల్లి , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లిలో ఎన్నికల కోడ్ లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న 96 వేల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.

సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు రవాణా చేయకూడదని వేములపల్లి ఎస్సై దాచేపల్లి విజయకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళ్తున్న కారులో 96 వేల రూపాయల నగదు లభించినట్లు తెలిపారు.

50 వేల రూపాయలకు నుంచి నగదు రవాణా చేయాలంటే సరైన పత్రాలు ఉండాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మొత్తంలో నగదు రవాణా చేస్తే తప్పనిసరిగా ఆధారిత పత్రాలు ఉండాలని సూచించారు. తనిఖీలలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ALDO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!