రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తున్న గుత్తా..!
రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తున్న గుత్తా..!
మిర్యాలగూడ , మన సాక్షి :
గుత్తా సుఖేందర్ రెడ్డి బిఎల్ఆర్ పై అడవిదేవులపల్లి లో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని, గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన పార్టీలకతీతంగా శాసనమండలి చైర్మన్.. అది మర్చిపోయి రాజకీయ విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకి నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుకూరు బాలు అన్నారు.
గురువారం మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఎల్ ఆర్ పాత మిర్యాలగూడ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామంలో జన్మించి అక్కడనే విద్యను అభ్యసించి తెలంగాణ ప్రాంతంలో పెరిగిన వ్యక్తి అన్నారు.
ALSO READ: మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
మిర్యాలగూడ ప్రాంతం మీద ఇక్కడి మట్టి తిన్న బిడ్డగా ఈ ప్రాంతం మీద అభిమానంతో ఈ ప్రజల మీద అభిమానంతో గత పది సంవత్సరముల నుండి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అన్నారు.
బి ఎల్ ఆర్ కోట్ల సంపాదించుకోవాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలనే కోరిక కాదు అతనిదని, అతని కోరికల్ల అతను చనిపోయిన రోజు ఇంటికి ఒక్కరూ స్మశాన వాటిక వరకు రావాలని, ఆ దిశలోనే ప్రజల అభిమానం కొరకు ప్రజా సేవ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి అన్నారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
బి ఎల్ అర్ గత పది సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న తరుణంలో అనుకోని పరిస్థితులలో రాజకీయాలలోకి రావటం జరిగిందని, సేవా కార్యక్రమంలో భాగంగా వైకుంఠ రథం తీసుకురాగా ఇటువంటి కార్యక్రమానికి ప్రభుత్వమే ఆదర్శంగా తీసుకొని అన్ని మున్సిపాలిటీలకు వైకుంఠ రథాన్ని తేవడం జరిగింది.
ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చూసి బి ఎల్ ఆర్ కి మంచి పేరు వస్తుందని ఈర్ష పడ్డ స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ప్రభుత్వం నుంచి వచ్చిన వాహనాలను ఒకటిన్నర సంవత్సరము రాకుండా ఆపి తన సొంత వైకుంఠ రథం వచ్చినాక ప్రభుత్వ వాహనాలను తయారు చేపించినారన్నారు.
ALSO READ : BIG BREAKING : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్..!
శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు పేదింటి ఆడబిడ్డలకు ఆడపిల్ల పెండ్లి భారం కాకూడదని పెళ్ళికానుక ఇవ్వడం జరుగుతున్నదని, ఆరోగ్య రక్ష వాహనం , బి ఎల్ ఆర్ తండ్రి ఈశ్వర్ రెడ్డి చనిపోతే తన తండ్రి పేరు మీదుగా ఈశ్వర బంధం అనే ప్రోగ్రామ్, అకాల మరణం చెందిన వ్యక్తి తాలూకా బంధువులు ఖనన కార్యక్రమాలు అయిపోయినాక భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు.
ఇటువంటి కార్యక్రమాల్ని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేయడం సరికాదు.
ఆంధ్ర ప్రాంత వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావుని పక్కన పెట్టుకుని ప్రజాసేవ చేసే బిఎల్ఆర్ ను విమర్శించడం ఆయన అవివేకం అన్నారు.
ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!
ఈ కార్యక్రమంలో , నాగు నాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా జనరల్ సెక్రెటరీ బెజ్జం సాయి, మాజీ ఎంపీపీ షేక్ జిందా, యువజన కాంగ్రెస్ నాయకులు సిద్దు నాయక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు రవితేజ నాయక్, మాజీ సర్పంచ్లు గుండు నరేందర్, హనుమంత నాయక్, మాజీ ఎంపీటీసీ లింగయ్య, చందు , వినయ్, సత్యం, పల్లి, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!









