BIG BREAKING : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్..!
BIG BREAKING : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్..!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దాంతో ఆ జోన్ పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. మల్టీ జోన్ -1 పరిధిలోని 20 జిల్లాల్లో టీచర్ల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ యధా విధంగా కొనసాగుతుంది.
కాగా ఇప్పటికే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ, తుది జాబితాలో జి హెచ్ ఎం పోస్టుల ఖాళీల జాబితాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు గురువారం వరకు అవకాశం ఇచ్చింది.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
కాగా అనూహ్యంగా హైకోర్టు 13 జిల్లాల్లో బదిలీలు పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలో కొందరు టీచర్లు సీనియార్టీ జాబితా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు చేసి స్టే విధించింది. దాంతో మల్టీ జోనల్ -2 పరిధిలో బదిలీలు ప్రక్రియ తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ జోన్ పరిధిలో 13 జిల్లాల్లో ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోనున్నది.
ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!










