Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారాజకీయం

Narayanpet : నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులపై అనిచిత వ్యాఖ్యలు క్రిమినల్స్ అడ్డ కూలీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసనగా శనివారం జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తా దగ్గర పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Narayanpet : నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులపై అనిచిత వ్యాఖ్యలు క్రిమినల్స్ అడ్డ కూలీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసనగా శనివారం జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తా దగ్గర పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిరుద్యోగులను క్రిమినల్స్ అనడం సిగ్గుచేటు అని అన్నారు. విద్యార్థులు ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్, పట్టణ అధ్యక్షుడు మణిశంకర్, మణి మోడీ, ప్రకాష్ చేతన్, అరవింద్, అన్వేష్, శివ, కురుమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు