Fake Certificate : భార్య సర్టిఫికెట్‌తో మోసం.. వీఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం..!
నకిలీ విద్యార్హత ధ్రువపత్రాన్ని ఉపయోగించి పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఒక వ్యక్తిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Certificate : భార్య సర్టిఫికెట్‌తో మోసం.. వీఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం..!
కరీంనగర్, మనసాక్షి :
నకిలీ విద్యార్హత ధ్రువపత్రాన్ని ఉపయోగించి పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఒక వ్యక్తిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలం తిప్పయ్యపల్లి గ్రామానికి చెందిన నలిగేటి తిరుపతి గా నిందితుడిని గుర్తించామని సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపారు.
గతంలో వీఆర్ఏ గా పనిచేసిన ఇతను, జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, ప్రస్తుతం గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై విధుల్లో ఉన్నాడు. తాను డిగ్రీ పూర్తి చేయకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే దురాశతో తన భార్యకు చెందిన డిగ్రీ లాంగ్ మెమోను ఆధారంగా తీసుకొని, అందులో తన పేరు, తండ్రి పేరు, రోల్ నంబర్ తదితర వివరాలను మార్చి నకిలీ కలర్ జిరాక్స్ డిగ్రీ మెమోను నిందితుడు తయారు చేసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు.
తదనంతరం ప్రభుత్వం వీఆర్ఏ,వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, విద్యార్హతల ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు చేపట్టిన సమయంలో, అప్పటికే వీఆర్ఏ గా పనిచేస్తున్న తిరుపతి సదరు నకిలీ డిగ్రీ మెమోను సమర్పించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందాడు. నిందితుడి వద్ద నుండి నకిలీ డిగ్రీ కలర్ జిరాక్స్ మెమోతో పాటు, నకిలీ ధ్రువపత్రం తయారీకి ఆధారంగా ఉపయోగించిన అతని భార్యకు చెందిన డిగ్రీ మెమో జిరాక్స్ ప్రతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు లేదా ఇతర ప్రయోజనాల కోసం నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు లేదా తప్పుడు పత్రాలను ఉపయోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు.
MOST READ
- ఆలూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అక్కడికక్కడే ఒకరు మృతి..!
- CM Revanth Reddy : సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక వారందరికి పింఛన్లు, ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ఆదేశం..!
- Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- ప్రాణం పోసిన రోడ్డుపై గుంత.. సినిమాను తలపించే అరుదైన ఘటన..!








