Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : నల్గొండ జిల్లాలో యదేచ్చగా ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు..!

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం లో 131వ సర్వే నెంబర్లు గల, నల్లకుంట ,చెరువును సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో యదేచ్చగా ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు..!

కేతేపల్లి, మనసాక్షి.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం లో 131వ సర్వే నెంబర్లు గల, నల్లకుంట ,చెరువును సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు మాట్లాడుతూ నల్లకుంట చెరువు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో కలదని, నాటి నైజాం కాలంలో గ్రామ ప్రజల మంచినీటి అవసరాల కోసం ఈ చెరువులను నిర్మించారని అన్నారు. అంత చరిత్ర కలిగినటువంటి చెరువు క్రమేపీ ఆక్రమణ గురవుతూ వస్తున్నదని, ఈ చెరువులో నీళ్లు నిలువ ఉంటేనే గ్రామంలోని మంచినీటి బోర్లకి భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉండేదని ఆయన అన్నారు.

అలాంటిది చెరువు చుట్టూ ఉన్నటువంటి రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణదారుల కుట్రలతో గ్రామానికి చెరువు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కేతపల్లి మండల కార్యదర్శి చింతపల్లి .లూర్దు మారయ్య మాట్లాడుతూ ఐబీ అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులు అలసత్వంతో మండలంలోని చెరువులు ఆక్రమణ గురవుతున్నాయని, ప్రతి చెరువుకి ఎఫ్డిఎల్ పరిధిలో హద్దురాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటూ, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నింపినటువంటి మట్టిని తొలగించి చెరువుల కుంటలను పూర్వ స్థితిలో ఉంచాలని అన్నారు.

ప్రధానంగా ఎన్ హెచ్ 65 వెంటనే ఆనుకొని ఉన్నటువంటి ఇనుపాముల నల్లకుంట చెరువు, కేతపల్లి మండల కేంద్రంలోని నిమ్మలమ్మ చెరువు ఆక్రమణకు గురవుతున్నా, హైవే మీద వెళుతున్నటువంటి ప్రజా ప్రతినిధులు , అధికారులు చూస్తూ ఉన్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

గతంలో కూడా అధికారులకు చాలా సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు గ్రామంలో చెరువులు కుంటలు లేకుండా అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని , అందుకని వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకొని మండలంలోని అన్ని చెరువుల కుంటలకు ఎఫ్ టి ఎల్ పరిధి లో హద్దు రాళ్ళు నిర్మించిచాలని, ఎఫ్ టి ఎల్ పరిధిలో రాళ్ళను తొలగించిన వారి పై, ఎఫ్ టి ఎల్ పరిధిలో మట్టిపూడ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఐబీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకొని మండలంలోని చెరువులు, కుంటలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ మండల కమిటీ సభ్యులు వంగూరు వెంకన్న, ఆది మల్ల నాగయ్య , రైతు సంఘం కేతేపల్లి మండల నాయకులు మన్యం మల్లయ్య, శ్రీను , రాజు , తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు