Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

చింతపల్లి, మనసాక్షి:

దేవరకొండ నియోజకవర్గంలోని పీఏ పల్లి మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్, అతని భార్య రమణ, తో పాటు వారి కుమారుడు అవినాష్ ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని పీసీసీ సభ్యులు నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిలియా నాయక్, జగన్ లాల్ నాయక్, వడ్త్యా రమేష్ నాయకులు అన్నారు.

గురువారం మృతుల ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుల మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయంగా నేనావత్ కిషన్ నాయక్ 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!

కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని నాయకులు భరోసా కల్పించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో, కొప్పుల అమర్నాథ్గౌడ్, కుమార్ నాయక్, మద్దిమడుగు నెల్సన్, శ్రీధర్ నాయక్ కొండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ నాయక్, కంబాలపల్లి పుల్లయ్య, కొండల్ వినోద్ రమేష్, శివ జైపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

మరిన్ని వార్తలు