Ponguleti : పొంగులేటి జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ

పొంగులేటి జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ

దమ్మపేట ,మనసాక్షి

నిరుద్యోగంతో అల్లాడుతున్న యువకులకు నేనున్నానంటూ పదివేల ఉద్యోగాలకు జాబ్ మేళా ప్రకటించి నిరుద్యోగ యువతకు చేయూతనిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడని పొంగులేటి అభిమాని పొంగులేటి పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ అన్నారు .

 

శుక్రవారం మండల కేంద్రంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద పొంగులేటి అభిమాన నియోజకవర్గ యువకుల ఆధ్వర్యంలో జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ పెద్ద స్థాయి చదువులు చదివి నిరుద్యోగంతో మగ్గిపోతున్న యువతను దృష్టిలో ఉంచుకొని 100కు పైగా కంపెనీలతో చర్చలు జరిపి ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఉన్న అతిపెద్ద నిరుద్యోగ యువత జీవితాలలో వెలుగు నింపే దిశలో పదివేల ఉద్యోగాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

 

10 నుంచి 12వ తరగతి వరకు అండర్ గ్రాడ్యుయేట్ డిప్లమా హోల్డర్ బి ఫార్మ ఎం ఫార్మా హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ బీటెక్ ఎంటెక్ బిఏ బి ఎస్ సి బీకాం ఎంబీఏ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన యువకులకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

 

ఈ నెల 29 తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ వెలుగుమట్లలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించబడుతుందని తెలిపారు ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల కేంద్రంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాల్లో అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కొరకు సౌకర్యాలను అందించడం జరుగుతుందన్నారు ఆన్లైన్లో చేసుకోవడానికి ఈనెల 28 తేదీ చివరి గడువు అని తెలిపారు

 

ఈ దిశలోనే నేడు విడుదల చేసిన పోస్టల్ లో స్కాన్డర్ సౌకర్యం కలిగించామని ఈ జాబ్ మేళా అవకాశాన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించి తమ కుటుంబ పోషణకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు

 

 

ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ జిల్లా సమన్వయకర్త చీకటి కార్తీక్ మండల నాయకులు ఎర్రగుంట్ల రాధాకృష్ణ రావు పండు నాగభూషణం యువ నాయకులు పాషా సాయిల నరసింహారావు నర్సరీ వెంకటేశ్వరరావు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు