Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : జనాదరణ పొందుతున్న మన సాక్షి పత్రిక.. డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్..!

Miryalaguda : జనాదరణ పొందుతున్న మన సాక్షి పత్రిక.. డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్..!

మన సాక్షి, మిర్యాలగూడ :

అతి తక్కువ కాలంలోనే జనాధరణ పొందుతున్న పత్రిక మన సాక్షి అని నల్గొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మన సాక్షి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పత్రికా ఎడిటర్ మల్లె నాగిరెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సాక్షి పత్రికకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనాదరణ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా మన సాక్షి పత్రికలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత జనాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాజుల శ్రీనివాస్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ నాయక్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు