Brothers : ఈ అన్నదమ్ములకు పేదరికమే తలవంచింది..!
Brothers : ఈ అన్నదమ్ములకు పేదరికమే తలవంచింది..!
కొండమల్లేపల్లి, మనసాక్షి :
ఆ ఇద్దరు అన్నదమ్ములకు పేదరికమే తలవంచింది. పేదరికంలో పుట్టినా ఉన్నత చదువులు చదివి ఇద్దరు ఒకేసారి ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొలుముంతల్ పహాడ్ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి యాదయ్య- యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో బొడ్డుపల్లి శివ కుమార్, బొడ్డుపల్లి చంద్రశేఖర్ కుమార్తె కళ్యాణి ఉన్నారు. కుమార్తె కళ్యాణికి రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. శివకుమార్ ఒకటి నుండి 10వ తరగతి వరకు కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ స్కూల్లో చదివారు, ఇంటర్ నల్గొండ లోని నల్గొండ కళాశాలలో, డిగ్రీ నిజం కళాశాలలో పూర్తి చేశారు, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ లో ఉద్యోగం సాధించారు. చిన్న కుమారుడు చంద్రశేఖర్ కు నెల రోజుల క్రితం ఏఈ ఉద్యోగం వచ్చింది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో చేరారు. ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో హాస్టల్ వెల్ఫేర్ గ్రేట్ టు ఆఫీసర్గా శివకుమార్ నియామకమయ్యారు.
కుమ్మరి యాదయ్య -యాదమ్మ కుటుంబం నిరుపేద కుటుంబం .రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించేవాడు. సంపాదన సరిపోక వ్యవసాయాన్ని పార్ట్ టైం గా చేస్తూ కొండమల్లేపల్లి పట్టణంలోని జ్ఞానోదయ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు .పిల్లలను ప్రయోజకులు చేయాలనే తపన యాదయ్యలో ఆణువు అణువు ఉండేది, వారికోసం అహర్నిశలు కష్టపడి సంపాదించిన దానితో వారిని ఉన్నతమైన చదువులు చదివించారు.
దురదృష్టవశాత్తు యాదయ్యకు డ్యూటీ కి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి కొన్ని నెలలు మంచానికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితులలో కూడా పిల్లలిద్దరు మొక్కవోని ధైర్యంతో తల్లిదండ్రుల కష్టాన్ని నెమరు వేసుకుంటూ ఇద్దరు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగులు సంపాదించారు. ఆకలేస్తే అందరూ అన్నం కోసం ఎదురుచూస్తారు కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు ఆకలేస్తే అక్షరాలను తింటూ ఉద్యోగమే లక్ష్యంగా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి అనుకున్నది సాధించారు.
తల్లిదండ్రుల కష్టం కళ్లారా చూసిన వారు కూడా చిన్ననాటి నుండే తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకొని ముందుకెళ్లారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు అన్నదమ్ములు ఇద్దరు బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుకున్నారు. ఎన్నడూ కూడా ఆడంబరాలకు పోకుండా తల్లిదండ్రుల మీద గౌరవంతో ఉన్నతంగా చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించి సమాజంలో గౌరవాన్ని సంపాదించుకున్నారు.
మా ఎదుగుదలలో ప్రతి మెట్టు మా తల్లిదండ్రుల కష్టం ఉందని ఈ సందర్భంగా వారు ఆనందంతో తెలిపారు . తమ పిల్లలు ఉన్నతంగా ఎదిగినప్పుడే తల్లిదండ్రుల హృదయం ఆనందంతో నిండుతుందని కుమ్మరి యాదయ్య- యాదమ్మ దంపతులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.
MOST READ :
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!










