కరెంటు కోతలపై సబ్ స్టేషన్ ముందు అన్నదాతల నిరసన..!

వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి, కో-ఆపరేటివ్ డైరెక్టర్ బుసిరెడ్డి వెంకటరెడ్డి, బిసి సంఘం మండల అధ్యక్షుడు పల్లా వెంకన్న లు ప్రభుత్వాన్ని కోరారు.

కరెంటు కోతలపై సబ్ స్టేషన్ ముందు అన్నదాతల నిరసన..!

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి 

వేములపల్లి , మన సాక్షి

వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి, కో-ఆపరేటివ్ డైరెక్టర్ బుసిరెడ్డి వెంకటరెడ్డి, బిసి సంఘం మండల అధ్యక్షుడు పల్లా వెంకన్న లు ప్రభుత్వాన్ని కోరారు.

సోమవారం మండలంలోని శెట్టిపాలెం సబ్ స్టేషన్ లో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. గత కొద్దిరోజులుగా వ్యవసాయానికి ఒకటి పూట 12గంటల విద్యుత్తును సరఫరా చేస్తూ రాత్రివేళ విద్యుత్తును వ్యవసాయానికి నిలుపుదల చేయడంతో పంట చేతికి అందే దశలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

పలుమార్లు విద్యుత్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు ఉన్నప్పటికీ పగటిపూట మాత్రమే విద్యుత్ అందించడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతతో నీరు పారినమడే పారి కిందకు దిగడం లేదన్నారు.

రాత్రి వేళలో సైతం విద్యుత్తును అందించినట్లయితే నీరు క్రింది మాడులకు చేరి పంటలు చేతికందుతాయని లేనిపక్షంలో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నక్క శేఖర్, బొంతు పుల్లయ్య, చల్లమల్ల వెంకటరెడ్డి, కొ డిదాల నాగేష్, నక్క నాగయ్య, గోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శంకర్ ,చంద్రయ్య , సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

  1. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
  2. Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!
  3. Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!