విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

పెన్ పహాడ్ ప్రతినిధి, మన సాక్షి

కరెంట్ షాక్ తో యువకుడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగెల్లి సందీప్(20) ఇంటిలోని మోటార్ కి వైర్ బిగిస్తూ ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి మరణించాడు.

 

కాగా మృతి చెందిన సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో సంఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. సందీప్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.