District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్ ఆదేశించారు.
సోమవారం హెలిపాడ్ కొరకు స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్, స్టేజి తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు, మహిళ సమాఖ్య పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు శంకుస్థాపనలు, ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెంషాలం,ట్రైనింగ్ కలెక్టర్ గరీమానరుల, అదనపు ఎస్పీ ఎండి. రియాజ్ హూల్ హక్, ఆర్. డి. ఓ. రాంచందర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంకిషన్, సిఐ లు శివ శంకర్, రామ్ లాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









