Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!
Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఉన్నాయి. నిబంధనల మేరకు నిర్వహణ లేకుండా పోయింది. దాంతో మిర్యాలగూడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం పలు ప్రైవేట్ ఆస్పత్రులను స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఆయన ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. మిర్యాలగూడలోని అంజిరెడ్డి రివర్ హాస్పిటల్, స్పందన హాస్పిటల్, సాహితీ హాస్పిటల్, దివ్య ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. దాంతోపాటు స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు.
ఆస్పత్రులలో ధరల పట్టికలు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం అయితే చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఆయన వెంట పి ఓ అరుంధతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ రవి, నరసింహ, మోతిలాల్, ప్రభాకర్, రమేష్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
RDO Office : న్యాయం కోసం ఆర్డివో కార్యాలయం వద్ద వృద్ధురాలు ఆవేదన..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనుల జాతర.. శంకుస్థాపనలు చేసిన మంత్రులు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
-
Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..!









