Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనుల జాతర.. శంకుస్థాపనలు చేసిన మంత్రులు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనుల జాతర.. శంకుస్థాపనలు చేసిన మంత్రులు..!

నల్లగొండ, మనసాక్షి :

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం అయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బక్కతాయి కుంట వద్ద 20 కోట్ల 22 లక్షల రూపాయల అంచనా తో నిర్మించనున్న బక్కతాయకుంట లిఫ్ట్ ఇరిగేషన్ కు,6 కోట్ల 8 లక్షలు రూపాయలతో నిర్మించే పునుగోడు ఎత్తిపోతల పథకానికి, 19.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.

అంతేకాక 36 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్మించనున్న అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదని తెలిపారు.

ఎన్నో ఏళ్ల నుండి రైతులు ఎదురుచూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎదుల ద్వారా నీరు అందించేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. అలాగే హై లెవెల్ కెనాల్ కు 442 కోట్లు మంజూరు చేశామని ,పిళ్లాయ పల్లి కాలువ ,శివన్న గూడెం నుండి నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు.

మూసిని పునరుద్ధరణ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు మేలు చేస్తామన్నారు. తమ హయాంలోనే ఎస్ఎల్బిసిని పూర్తిచేస్తామని తెలిపారు. దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ,మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేస్తామని, అలాగే ఐటిపాముల లిఫ్ట్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి అతి త్వరలోనే స్టేజి వన్ ద్వారా సాగు నీరు ఇస్తామన్నారు.

అలాగే రాచకాలువ పనులు పూర్తి చేస్తామని, గంధమల్ల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణపూర్ ,చౌటుప్పల్ కు కాల్వ విస్తరించి నిరందిస్తామన్నారు. పెళ్లిపాకల, గాజుపేట లిఫ్ట్ ఇరిగేషన్ నుచేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల నుండి తుంగతుర్తికి సాగునీరు తెస్తామని, ఎస్సారెస్పీ ప్రాజెక్టును పునరుద్ధరణ చేసి నీళ్లు పెంచుతామని తెలిపారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోకసారి సమీక్షిస్తామన్నారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 66.7 లక్షల ఎకరాలలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని, యాసంగి ధాన్యం కలుపుకుని మొత్తం 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామని ,స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా ధాన్యం పండించామని, అంతేకాక సన్న ధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ను ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు వంటివి పూర్తి చేయలేదని, అలాగే ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ,రేషన్ కార్డుల పై దొడ్డు బియ్యం ఇచ్చారని, తాము సన్నధాన్యాన్ని ఉచితంగా 85 జనాభాకు ఆరు కేజీల చొప్పున ఇస్తున్నామని, ఎక్కువ శాతం జనాభా కు ఉపయోగపడే పథకం సన్నబియ్యం అని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, నల్గొండ నుండి ఫిలిప్పీన్స్ కు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామని చెప్పారు . రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 36 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు బ్లాకుకు శంకుస్థాపన , సుమారు 50 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం సంతోషమని తెలిపారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కలెక్టర్ కార్యాలయం అయిందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు పెరగడం, కార్యాలయాలు పెంపు వల్ల ప్రస్తుతం ఉన్న కలెక్టర్ సరిపోదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ అండ్ బి శాఖ ద్వారా 36 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 9 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు .

ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇది వరకే బయట ఉన్న డీఈఓ ,డిఎంహెచ్ కార్యాలయాలు సైతం జిల్లాబ్ కలెక్టర్ కార్యాలయానికి వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం సన్న బియ్యం పథకాన్ని ఇస్తున్నదని, ప్రతినెల మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, దీనితోపాటు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులలో భాగంగా 1600 కోట్ల రూపాయలు మంజూరు చేసామని, అవసరమైతే మళ్లీ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రణాళిక ప్రకారం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంటికంటే ఎక్కువ సమయం కార్యాలయంలోనే ఉంటారని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదనంగా నిర్మిస్తున్న అదనపు బ్లాక్ లో 82,000 స్క్వేర్ ఫీట్లు మంచి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.

బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద 737 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని, ఈ ప్రాజెక్టు వల్ల 97,000 ఆయకట్టు పెరిగిందన్నారు. జిల్లాలో ఆయకట్టు పెరిగి, ధాన్యం ఉత్పత్తి నాలుగు సార్లు పెరగడం వల్ల సన్నబియ్యాన్ని ఇవ్వగలుగుతున్నామని ,అలాగే మొట్టమొదటి క్రిటికల్ కేర్ యూనిట్ ను నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని, ఉద్యోగులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథంలో తీసుకు వెళ్లేందుకు అందరూ చేయూతనందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం, భూ భారతి, రైతుబంధు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పేదవాడికి అందేలా చూడాలని కోరారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ తాము డిండి ప్రాజెక్టు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, దీనివల్ల మూడు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నియోజకవర్గం లో చేపట్టిన తక్కిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా త్వరితగతను పూర్తి చేయాలని, అట్లాగే దేవరకొండలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు, రహదారులను మంజూరు చేసి పూర్తిచేయాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా జిల్లాను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు బ్లాక్ నిర్మిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు సాహసోపేత నిర్ణయం అని ,అలాంటి పౌరసరఫరాల మంత్రి జిల్లాలో ఉండడం సంతోషకరమని అన్నారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ ,డిసిసిబి అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, జవహర్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రులు 5 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మండ్ల కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు.సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శన ఇచ్చారు.

MOST READ :

  1. Murder : పట్ట పగలు, అందరు చూస్తుండగా.. దారుణ హత్య..!

  2. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

  3. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  4. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు