BREAKING : రేపు ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్..!
BREAKING : రేపు ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్..!
నల్లగొండ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యంతో నిండే అవకాశం ఉన్నందున ఈనెల 5న ఉదయం 8 గంటలకు నాగర్జున సాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తివేయనున్న దృష్ట్యా ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటన కోరారు.
ప్రజలేవరు నదిలోకి స్నానానికి వెళ్లవద్దని,యువకులు ఈత కొట్టేందుకు నదిలోకి వెళ్లవద్దని, అదేవిధంగా పశువులు ,మేకలు, గేదలు వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్ల వద్దని ఆయన కోరారు .ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు భారీ వరద కొనసాగుతున్నదని, ఏ సమయంలోనైనా నాగార్జునసాగర్ ప్రాజక్ట్ రిజర్వాయర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు.
ప్రాజక్ట్ పూర్తి సామర్థ్యం 312.505 టీఎంసీల కు గాను, ఇప్పటివరకు 266.358 టీఎంసీల సామర్థ్యానికి చేరిందని, శ్రీశైలం ప్రాజెక్టు నుండి వరద ఉధృతి కొనసాగుతున్న దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఏ సమయంలోనైనా చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని 5 తేదీన ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి వదిలి వేయడం జరుగుతున్నదని తెలిపారు. అంతేకాక శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు నుండి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల ఉంటుందని తెలిపారు.
అందువల్ల నాగార్జునసాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కింది భాగంలోని ప్రజల ఆస్తి నష్టం ప్రాణ నష్టం వంటివి జరగకుండా సంబంధిత మండలాల, గ్రామాల అధికారులందరూ చర్యలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ALSO READ :
Nagarjunasagar : సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు టైం ఫిక్స్.. Latest Update
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!
NEET : రైతు కూలీ బిడ్డకు నీట్ లో ర్యాంక్..!
Miryalaguda : ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా మార్చాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి









