రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ పోటీలు ప్రారంభం

మఠంపల్లి , మన సాక్షి:

మఠంపల్లిలోని మాన్ ఫోర్ట్ స్కూల్ గ్రౌండ్లో జూనియర్ బాల బాలికల రగ్బీ పోటీలు అట్టహాసంగా బుధవారం ప్రారంభమయ్యాయి.

 

ఈ పోటీలలో సూర్యాపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, మేడ్చల్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, యాదాద్రి, వరంగల్ మహబూబాబాద్ 15 జిల్లాల నుండి దాదాపు 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెంట్ ఆన్స్ సుపీరియర్ సిస్టర్ బాల సుందరి మాట్లాడుతూ మఠంపల్లిలో రాస్తాయి పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని ,క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో కన్న తల్లిదండ్రులకు తమ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు .

 

భవిష్యత్తులో క్రీడల వల్ల ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు ఈ సర్టిఫికెట్స్ ఎంతో ఉపయోగపడతాయని, అలాగే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

 

ఈ రోజుల్లో యువత పక్కదారిన పడి చెడిపోతున్నారని, దీని బదులు క్రీడలకు సమయం కేటాయించి అన్ని రంగాల్లో ముందుకు పోవచ్చునని, కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

 

సెమీఫైనల్స్ కు చేరుకున్న బాలికల జట్లు సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్న బాలుర జట్లు సూర్యాపేట, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జట్లు చేరుకున్నాయని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ తరుణ్ రెడ్డి తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్ణం గణేష్, రవికుమార్, అబ్జర్వర్స్ నోయల్, బ్రదర్ స్కూల్ ప్రిన్సిపాల్ పితృస్, సిస్టర్ సుజాత,శుభోదయం యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్ రెడ్డి

 

వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అబ్బయ్య,పృద్వి,శ్రీకాంత్, అజయ్, నిరంజన్, నరేష్ మ్యాచ్ రిఫరీలు శ్రీకాంత్, మహేష్,రాజేష్,సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.