రాహుల్ ప్రెస్ మీట్ : బిజెపికి భయపడను, ప్రశ్నిస్తూనే ఉంటాను

రాహుల్ ప్రెస్ మీట్ :
బిజెపికి భయపడను,
ప్రశ్నిస్తూనే ఉంటాను
న్యూఢిల్లీ
సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించారు. సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిన అనంతరం ఆయన పార్లమెంటు సభ్యత్వం పై వేటు పడిన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తాను ప్రశ్నించకుండా ఉండేందుకే తనపై వేటు వేశారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదానికి.. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదాని వ్యవహారంలో పూర్తి వివరాలు స్వీకర్ కు అందజేశానని తెలిపారు.
పార్లమెంట్ లో తాను అడిగిన ప్రశ్నకు సమాధానాలు కూడా చెప్పలేదని పేర్కొన్నారు. బిజెపికి తాను భయపడేది లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ప్రజల పక్షాన ప్రశ్నిస్తానని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను పార్లమెంటులో ఉన్న బయట ఉన్న ఏమి తేడా లేదన్నారు. అదానిపై పార్లమెంటులో ప్రశ్నించినందుకు తనకేమి జరిగిందో..? దేశ ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
తనపై ఎందుకు అనర్హత వేటు వేశారో ఆలోచించండి అని అన్నారు. అదేవిధంగా తనకు మద్దతునిచ్చిన వారందరికీ రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.