Penpahad : వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటి.. ఎండి పోతున్న వరి నాట్లు..!
Penpahad : వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటి.. ఎండి పోతున్న వరి నాట్లు..!
పెన్ పహాడ్, మన సాక్షి:
పెన్ పహాడ్ మండల పరిధిలో వివిధ గ్రామాలలో వర్షాలు కురవక చెరువులలో నీళ్లు లేక భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోయి బోర్లు నీళ్లు పోయకపోవడంతో నాటు వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. పలువురు రైతులు తమ ఆవేదనను మన సాక్షి ప్రతినిధి ముందు పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లో చిన్న సీతారాం తండా కు చెందిన రైతు బానోత్ శ్రీను వరి నారు పోసిన నారుమడి కి నీరు లేకపోవడంతో బోర్లు పోయకపోవడంతో పూర్తిస్థాయిలో ఎండిపోయిందని రైతు బానోత్ శీను తెలిపినారు. అదే తండాకు చెందిన బానోతు రతి రామ్ ఐదు ఎకరాల వరి పొలం నాటు పెట్టినాడు గత నెల రోజుల క్రితం బోర్లు పుష్కలంగా పోయటం వలన వరి పొలం నాటు పెట్టారు.
వర్షాలు సరిగా కురవకపోవడంతో, దానికి తోడుగా కాలేశ్వరం జలాలు వారాబంది ప్రకారం వస్తాయని ఆశతో వరి పొలం నాటు పెట్టామని భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోవడం వలన వరి పొలం ఎండిపోతుందని రైతు బానోతు రతిరామ్ నాయక్ తన ఆవేదనను వెలిబుచ్చినాడు. చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు గడ్డం బజార్, ఒక ఎకరం వరి పొలం నాటు పెట్టగా బోరు నీరు పోయడం తగ్గడంతో వరి పొలం పూర్తిస్థాయిలో ఎండిపోయే పరిస్థితులు ఉన్నదని రైతు తన ఆవేదనను వెలిబుచ్చినాడు.
డ్రం సీడర్ తో రెండు ఎకరాల పొలం చేయగా బోర్లు పోయకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతు గడ్డం రామకృష్ణ తెలిపినారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం జలాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో శ్రీరాంసాగర్ కాలువల ద్వారా కాలేశ్వరం జలాలతో కుంటలు చెరువులు నింపి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చినారని రైతు బానోత్ శ్రీను మరియు కొంతమంది రైతులు తెలిపినారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం దయాగుణంతో కాలేశ్వరం జలాలను వదిలి రైతులును ఆదుకోవాలని పలువురు రైతులు, రైతు సోదరులు సోదరీమణులు కోరుతున్నారు.
MOST READ :
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!









