Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!

Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాఖి గిఫ్ట్ అందజేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాఖీ పండుగ సందర్భంగా వంట గ్యాస్ కు మరో వంద రూపాయలు సబ్సిడీ పెంచారు. దాంతో వంట గ్యాస్ వినియోగదారులకు 300 రూపాయల సబ్సిడీ అందనున్నది. గతంలో 200 రూపాయల సబ్సిడీ మాత్రమే వచ్చేది. రాఖీ పండుగ గిఫ్ట్ సందర్భంగా మరో వంద రూపాయలు పెంచడంతో ఇప్పుడు 300 రూపాయల సబ్సిడీ గ్యాస్ అందనున్నది.
2025-26 ఆర్థిక సంవత్సరంకుగాను ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కు గాను కేంద్ర ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు ఈ సబ్సిడీ అందనున్నది. దాంతో 45 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరాలని
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా వంట గ్యాస్ అందజేస్తుంది. అందుకుగాను ఆధార్ కార్డు, రేషన్ కార్డు తో పాటు గతంలో గ్యాస్ కనెక్షన్ లేనివారికి, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ ను అందజేస్తుంది. ఈ పథకాన్ని కూడా మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వం అందజేసే సబ్సిడీ గ్యాస్ కు ప్రస్తుతం 905 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్ ధర ఉంటే 300 రూపాయల సబ్సిడీతో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి 605 రూపాయలకు రానున్నది. ముందుగా గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి 905 రూపాయలు చెల్లిస్తే ఆ లబ్ధిదారులకు తిరిగి 300 రూపాయలు వారి ఖాతాలలో జమ కానున్నాయి. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఏడాదికి 9 రీ ఫిలిం గ్యాస్ లు పొందవచ్చును.
MOST READ :
-
Miryalaguda : గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాతో మిర్యాలగూడ యువకుల లింకు..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Gold Price : ట్రంప్ ఎఫెక్ట్.. కొండెక్కిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!









