Income Certificate : రేషన్ కార్డు ఉంటే ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదు..!
Income Certificate : రేషన్ కార్డు ఉంటే ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదు..!
పెన్ పహాడ్, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం బీసీ కార్పొరేషన్ లోన్ కొరకు దరఖాస్తుకు జతపరుస్తున్న ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదని మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డు లేకుంటే, లేనివారు.
ఆదాయం సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకోవాలని 2016 తరువాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే జతపరచవచ్చని బీసీ కార్పొరేషన్ సంస్థ స్పష్టత చేసిందని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు మండలంలో 353 మంది దరఖాస్తు చేసుకున్నారని ఈ నెల 14వ తారీకు లోగా దరఖాస్తు చేసుకోని వారు ఆన్లైన్ చేసుకుని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తులు ఇవ్వాలని ఆయన తెలిపినారు. నాలుగు లక్షల సాయం కొరకు మండల వ్యాప్తంగా శుక్రవారం వరకు 353 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపినారు.
MOST READ :
-
Gold Price : ఒక్క రోజే కుప్పకూలిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Paddy Centers : కొనుగోలు కేంద్రాలలో ధాన్యంకు మద్దతు ధర.. రూ.500 బోనస్ పొందండి..!
-
Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)
-
Miryalaguda : మిర్యాలగూడ వాసికి గ్రూప్ 1 లో 6వ ర్యాంకు.. సన్మానించిన మాజీ ఎమ్మెల్యే..!









