మిర్యాలగూడ : రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మాడుగులపల్లి, మనసాక్షి:
రైతును రాజు చేయడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మాడుగులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి గ్రామంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు వేదిక ను గురువారం ఆయన స్థానిక ఎంపీపీ పోకల శ్రీవిద్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ALSO READ :Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!
రైతులు వ్యవసాయం లో మంచి చెడులు చర్చించుకునేందుకు రైతు వేదిక ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు.అదే విధంగా జూన్ 2 నుంచి జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి గ్రామంలో ఘనంగా జరపాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాంపల్లి శ్రీశైలం, ఏడీఏ పోరెడ్డి నాగమణి,మండల వ్యవసాయ అధికారి సైదానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబయ్య, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి,ఏఈ నరేష్ తదితరులు ఉన్నారు.