Miryalaguda : మిర్యాలగూడలో అక్రమ కట్టడాల తొలగింపు.. నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారని భార్గవ్ ఆగ్రహం..!
Miryalaguda : మిర్యాలగూడలో అక్రమ కట్టడాల తొలగింపు.. నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారని భార్గవ్ ఆగ్రహం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన స్థలాల్లో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. జెసిబి లతో నిర్మాణాలను కూల్చివేశారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచింది.
మిర్యాలగూడ పట్టణంలోని 626 సర్వేనెంబర్ చింతపల్లి బైపాస్ సమీపంలో ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూములను గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకొని నిర్మాణాలు సైతం చేపట్టారు. కాగా కాలువ హద్దులు చెరిపి నిర్మాణాలు చేశారు. ఈ విషయంపై ఇటీవల స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దాంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మిర్యాలగూడ తహసిల్దార్ హరిబాబు ఆధ్వర్యంలో ఆర్ ఐ, సర్వేర్లు, రెవిన్యూ సిబ్బంది జెసిబి ల సహకారంతో నిర్మాణాలను కూల్చివేశారు. కాల్వ ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను,
అదేవిధంగా పిల్లర్స్ తో నిర్మించే కార్యాలయ నిర్మాణాన్ని కూల్చి వేశారు. కాగా తమకు నోటీసులు ఇవ్వకుండా, బౌండరీలు ఫిక్స్ చేయకుండా నిర్మాణాలు కూల్చివేయడం ఏంటని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా పోలీస్ బందోబస్తుతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు.
మరిన్ని వార్తలు
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!
-
District collector : ఆఫీస్ అంతా ఖాళీ.. జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం, అసలేం జరిగింది..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!










