ManaSakshi effect : మన సాక్షి కథనానికి స్పందన.. రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు..!
ManaSakshi effect : మన సాక్షి కథనానికి స్పందన.. రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు..!
అర్వపల్లి, మన సాక్షి :
భారీ వర్షాలతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అతలాకుతలం ఆయన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటన ప్రజలందరికీ తెలుసు. తుంగతుర్తి నియోజకవర్గం లో రోడ్డు లేక అవస్థలు పడుతున్న సంఘటన మన సాక్షి పత్రికలో కథనం ప్రచురించడంతో దానికి స్పందించిన ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలం కొమ్మల ఆవాస గ్రామం మర్రిబాయి తండా లో రోడ్ల పరిస్థితి బాలేనందున స్కూల్ పిల్లలు వెళ్లే ఆటో బురద గుంటలో దిగుబడి పోతే స్కూల్ విద్యార్థులు ఆటోని బయటికి లాగిన సందర్భంగా తీసిన ఫోటోని, మన సాక్షి దినపత్రిక లో కథనం ప్రచురించింది.
ఆ వార్త చూసిన నాయకులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్, వెంటనే ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించి 4.80 లక్షల రూపాయలను మంజూరు చేయించినట్లు జాజిరెడ్డిగూడెం పిఎసిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. రెండు రోజుల్లో మరి బాయ్ తండా కు రవణా సౌకర్యాలని కల్పిస్తామని హామీ ఇచ్చారు
LATEST UPDATE :
-
NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!
-
నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పూడ్చివేత.. పరిశీలించిన మంత్రి ఉత్తమ్..!
-
District collector : వారం రోజుల్లో మార్పు రావాలి, లేదంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
-
KTR : అనుముల తిరుపతిరెడ్డి గారూ.. సామాన్యులకు ఆ.. కిటుకేదో చెప్పండి.. కేటీఆర్ ట్వీట్..!









