తెలంగాణBreaking Newsరాజకీయం

CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. నేతల్లో టెన్షన్..!

CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. నేతల్లో టెన్షన్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోమవారం బిజీ బిజీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాలు, ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కోసం వినతి పత్రాలు అందజేసి చర్చించారు.

ఏఐసీసీ పెద్దలతో సమావేశం : 

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసిసి పెద్దలతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఖాళీ కావడంతో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. దాంతో ఎవరిని నియమించాలనే అంశంపై ఏఐసిసి పెద్దలతో చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ నటరాజన్ కొత్తగా రావడం.. ఆమె పార్టీ మారిన వారికి పదవులు ఇచ్చేది లేదని, కష్టపడిన వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేయడంతో రాష్ట్ర నాయకుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు ఖరారైతారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.

MOST READ : 

  1. MLC Counting : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రిజల్ట్.. ముందంజలో పింగిలి.. ఎన్ని ఓట్లంటే..!

  2. MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు