Revanth reddy : ఈనెల 6న పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి సభ..!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 6న పాలమూరుకు రానున్నారు. జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహా లు జరుగుతున్నాయనీ సీఎం రేవంత్ రెడ్డి సభను పెద్ద ఎత్తున ప్రజలు జయప్రదం చేసి పాలమూరు ముద్దుబిడ్డను ఆశీర్వదించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

Revanth reddy : ఈనెల 6న పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి సభ..!

మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 6న పాలమూరుకు రానున్నారు. జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహా లు జరుగుతున్నాయనీ సీఎం రేవంత్ రెడ్డి సభను పెద్ద ఎత్తున ప్రజలు జయప్రదం చేసి పాలమూరు ముద్దుబిడ్డను ఆశీర్వదించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గత పది ఏళ్ళుగా ప్రజలు సరైన ప్రజారంజక పాలన అందక
ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలను కళ్లారా చూసిన సీఎం రేవంత్ రెడ్డి అనేక పోరాటాలు నిర్వహించి అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సంక్షేమాలు అమలు చేయాలనీ ప్రజల పరిస్థితిలకు అనుగుణంగా 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి అందులో నాలుగు గారెంటీలు పూర్తి చేయడం జరుగుతుందని, మరికొద్ది రోజుల్లో ఆరు గ్యారెంటిలు కూడా పూర్తి చేస్తామని అన్నారు.

ALSO READ : BIG BREAKING : ముగ్గురు కొడుకులకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య..!

పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవడం సహజమేనని వాటిని అధికమించి ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తమ ప్రియతమ నేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రకు బాసటగా పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ గళం వినిపిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అన్యాయాలు దుర్మార్గాలపై నిలదీసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఈ సందర్భంగా చెప్పారు.

కేంద్రంలో దుర్మార్గమైన పాలనను అంతమొందించాలని శంకర్ పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతి రెడ్డి, చెన్నయ్య, బాలరాజ్ గౌడ్, రాజు, చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణారెడ్డి, ముబారక్, మెహబూబ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలమూరు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులు విడుదల చేశారు.

ALSO READ : Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!