Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Breaking : కరీంనగర్ లో కాల్పుల కలకలం.. పట్టపగలు తుపాకులతో బెదిరించి గోల్డ్ షాప్ లో దొంగలు హల్ చల్..!

కరీంనగర్ లో కాల్పుల కలకలం.. పట్టపగలు తుపాకులతో బంగారం షాపులో దొంగలు హల్చల్ సృష్టించారు. షాపు నిర్వాహకులపై కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు.

Breaking : కరీంనగర్ లో కాల్పుల కలకలం.. పట్టపగలు తుపాకులతో బెదిరించి గోల్డ్ షాప్ లో దొంగలు హల్ చల్..!

మనసాక్షి, కరీంనగర్ :

కరీంనగర్ లో కాల్పుల కలకలం.. పట్టపగలు తుపాకులతో బంగారం షాపులో దొంగలు హల్చల్ సృష్టించారు. షాపు నిర్వాహకులపై కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో పి ఎం జె బంగారం షాపులోకి ఆగంతకులు తుపాకులతో చొరపడి కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత బంగారం చోరీ చేశారు. బంగారం షాప్ లోకి చొరబడిన అగంతకులు ముందుగా సిబ్బందిని కట్టిపడేసి దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తుంది. వాష్ రూమ్ నుంచి వచ్చిన ఓ సిబ్బంది ప్రతిఘటించడంతో కాల్పులు జరిగినట్లు సమాచారం.

దుండగుల కాల్పుల్లో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. బంగారం షాపు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ సిపి తో సహా ఫోరెన్సిక్ నిపుణులతో సహా బంగారం షాపులో వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు