Miryalaguda : మధుసూదన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ..!
ఇటీవల గుండెపోటుతో మరణించిన తన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం.మధుసూధన్ మరణం బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Miryalaguda : మధుసూదన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ..!
మిర్యాలగూడ, మనసాక్షి :
ఇటీవల గుండెపోటుతో మరణించిన తన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం.మధుసూధన్ మరణం బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లోని ఉపముఖ్యమంత్రి పి ఆర్ ఓ దివంగత మధుసూదన్ గృహాన్ని సందర్శించి మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మధు మరణం తనకు షాకింగ్ న్యూస్ అని, మధుసూదన్ మరణ వార్త విన్న వెంటనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ,చిన్న వయసులో మధుసూదన్ చనిపోవడం బాధాకరమని, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. మధుసూదన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
కీర్తిశేషులు మధుసూదన్ భార్య జ్యోతి, కుమారుడు వెంకట్ సూరజ్ లను ఆయన ఓదార్చారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తదితరులు ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్నారు .









