Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ACB : రైతుల నుంచి లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ సర్వేయర్..!

ACB : రైతుల నుంచి లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ సర్వేయర్..!

దమ్మపేట, మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సర్వేయర్ వెంకటరత్నం రైతుల నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. రైతు సంచలన విషయాలు బయటపెట్టాడు. రెవెన్యూ కార్యాలయంలో కనీస రెవెన్యూ చట్టాలు తెలియని వారు ఉద్యోగులుగా పని చేస్తున్నారని ఆరోపించాడు.

తన రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ నెంబర్ల తేడాలు ఉన్నాయంటూ మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పుతూ చివరికి డబ్బులు డిమాండ్ చేశాడని వెల్లడించారు. ప్రస్తుతం సర్వేయర్ వెంకటరత్నం ను ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారిస్తున్నారు.

Reporting : 

Shanmukh, Dammapet

MOST READ :

మరిన్ని వార్తలు