Miryalaguda : శిష్య పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన మాసోత్సవం..!
Miryalaguda : శిష్య పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన మాసోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శిష్య పాఠశాలలో మంగళవారం రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వీరస్వామి, ట్రాపిక్ ఎస్.ఐ. శ్రీనివాస్ , మొదటి వార్డు కౌన్సిలర్ – శాగ జయలక్ష్మి, జలంధర్రెడ్డి, శిష్య, సెయింట్ జాన్స్ పాఠశాలల చైర్మన్ అల్లుబెల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీవో వీరస్వామి మాట్లాడుతూ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న స్థలాల వద్ద ఓవర్టేకు చేయగూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని ‘ (ట్రాఫిక్ నిబందనలను Red, green, Yellow, lights తప్పని సరిగా పాటించాలని చెప్పారు.
అలాగే ట్రాపిక్ ఎస్.ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు సీటుబెల్ట్ ధరించాలని, రోడ్డును దాటేటప్పుడు zebra Crossing ను పాటించాలని, రోడ్లును క్రీడా- మైదానాలుగా వాడవద్దు, అనివార్య ప్రమాదాలకు తావు ఇవ్వవద్దు అని చక్కగా విద్యార్థులకు వివరించారు.
మొదటి వార్డు కౌన్సిలర్ శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి మాట్లాడుతూ 18సం, నిండని విద్యార్థులు బైక్స్ నడపవద్దు అని, నడిపితే దాని వల్ల ఎక్కువగా ప్రమాదాలు అవుతున్నాయని, తప్పనిసరిగా లైసెన్స్ మరియు హెల్మట్ పెట్టుకొవడం వలన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని వివరించరు.
అలాగే శిష్య పాఠశాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వాహనాలను నడిపేటప్పుడు సెల్ఫోన్ వాడవద్దు అని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను చూస్తూ వాహనాలను నడపాలని, పొగమంచు, చీకటి ప్రదేశాలలో వెళ్ళేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలని, విద్యార్థులకు తెలియజేశారు. ఈ రోజు విద్యార్థులు, రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థులకు చక్కగా వివరించారు.
MOST READ :










