District collector : గ్రామసభలో సమయపాలన పాటించాలి.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : గ్రామసభలో సమయపాలన పాటించాలి.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
సూర్యాపేట, మనసాక్షి :
జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్, జిల్లాలోని ఆర్డీవోలు ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు తాసిల్దార్లు పంచాయతీ సెక్రెటరీలతో వేబిక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల పై ఈనెల 21 నుండి 24 వరకు గ్రామ సభ నిర్వహణ గురించి అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలు అమలకు జనవరి 26న ప్రారంభించిన నేపథ్యంలో ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా సమయపాలన పాటిస్తూ సభలు నిర్వహించాలని ఎక్కడా ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదని అధికారులు అందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు.
గ్రామ సభలలో ఫ్లెక్సీలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రదర్శించాలని గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను స్వీకరించి రిజిస్టర్ను నందు వ్రాయాలని తెలిపారు. గ్రామ సభలకు ఉశ్రుత ప్రచారం చేపట్టాలని ఒక రోజు ముందుగానే గ్రామాలలో టామ్ టామ్ వేయించాలని తెలిపారు.
నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని పేర్కొన్నారు వాటిపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ప్రజలకు స్పష్టంగా వివరించాలని కలెక్టర్ తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యతగా వివరించాలని సూచించారు. గ్రామసభల తీర్మాణ పత్రాలను సురక్షితంగా ఎంతో జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ తెలిపారుడేటా ఎంట్రీ కార్యక్రమం జాగ్రత్తగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
గ్రామసభలు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించాలని, రేపు జిల్లాలో 142 గ్రామ పంచాయతీలలో , ఐదు మున్సిపాలిటీలలోని 36 వార్డులలో గ్రామసభలు నిర్వహిస్తున్నామని ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ వెబేక్స్ వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ డి ఓ ,సీఈఓ వి వి అప్పారావు ,డిపిఓ నారాయణరెడ్డి, డి సి ఎస్ ఓ రాజేశ్వరరావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
-
TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!
-
TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!









