Suryapet : ధాన్యం విక్రయించి వస్తుండగా రూ.1.70 లక్షలు చోరీ..!
Suryapet : ధాన్యం విక్రయించి వస్తుండగా రూ.1.70 లక్షలు చోరీ..!
అనంతగిరి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గొండ్రియాల గ్రామానికి చెందిన కొండ బాల పుల్లయ్య అనే రైతు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ధాన్యం అమ్మగా వచ్చిన లక్ష డెబ్భై వేల నగదును తీసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో స్కూటీ పై వచ్చిన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముగ్గురు దొంగలు పుల్లయ్య పై దాడి చేసి నగదును దొంగలించారని తెలిపారు . అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి బైక్ రెండు సెల్ ఫోన్లు లక్ష డెబ్భై వేల నగదును స్వాధీనం చేసుకునీ నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. నిందితులు నేర చరిత్ర కలిగి ఉన్నవారని తెలిపారు. కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు.
MOST READ :
-
Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!
-
Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!









