Rythu Bharosa : రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలే.. వారికి కట్, ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలే.. వారికి కట్, ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం ప్రభుత్వం ఫైనల్ చేసింది. రైతు భరోసా పథకం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతు భరోసా పథకం పై కీలక చర్చ నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు. కాగా రైతు భరోసా పథకంపై ఎకరానికి 12 వేల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేయనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందజేయగా తాము మరో రెండు వేల రూపాయలను పెంచి 12 వేల రూపాయలను ఇస్తామని చెప్పారు. వాస్తవానికి ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఆదాయ వనరులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వ్యవసాయ యోగ్యం కానీ భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని స్పష్టం చేశారు. రహదారులు, గుట్టలు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు తీసుకున్న భూములకు రైతు భరోసా వర్తింపదని ఆయన పేర్కొన్నారు.
అయితే రైతు భరోసా విధివిధానాలకు సంబంధించి క్యాబినెట్ సమావేశం సుదీర్ఘ చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా రైతు భరోసా పథకాన్ని రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
MOST READ :
-
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Elections : పంచాయతీతో పాటే మునిసిపల్ ఎన్నికలు.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..!
-
Gold Price : కొత్త సంవత్సరంలో భారీ శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!









