Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

మన సాక్షి, దామరచర్ల :

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. అలాంటిది ఒక్కసారిగా లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికితే ఎలా ఉంటుందో ఊహించలేం. అలాంటి సంఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఓ రైతుకు వచ్చింది. వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్ళగా పంట పొలంలో 20 లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. దాంతో వెంటనే ఆ రైతు పక్కన ఉన్న ఇతర రైతులకు చూపించగా వాటిపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో దొంగ నోట్లు గా గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 500 రూపాయల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఇది పక్కా దొంగ నోటు ముద్రించేవారు పనే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  2. KCR : కేసీఆర్ ఇంటర్నెట్ – జిరాక్స్ సెంటర్ ప్రారంభం..!

  3. Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!

  4. Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు