Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 30 వేల రూపాయల ఆర్థిక భరోసా అందనున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయం రావడంతో రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తూ రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీలలో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ పార్టీకి మైలేజీ రాలేదు. దాంతో మహిళలకు ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు నెలకు 2500 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు గాను అధికారులు అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. 55 సంవత్సరాల లోపు వయసు ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, పెన్షన్ సౌకర్యం లేని మహిళలకు నెలకి 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూలై మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని త్వరలో ఎన్నికల తేదీని ప్రకటించనున్నారని చెబుతున్న క్రమంలో అంతకుముందే మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మహిళల్లో విశ్వాసం పొంది గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
-
Suryapet : ఆయిల్ పామ్ రైతుల పంట పండుతోంది.. ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం..!
-
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
-
Penpahad : రైతునేస్తం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రైతుల ముఖాముఖి..!
-
Cultivation : దుక్కులు రెడీ.. వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతులు..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!









