Penpahad : రైతునేస్తం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రైతుల ముఖాముఖి..!
Penpahad : రైతునేస్తం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రైతుల ముఖాముఖి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
రైతు నేస్తం కార్యక్రమం 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానము ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు చీదేళ్ల , అనాజిపురం, రైతు వేదిక ల లో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలో మండల స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ తాసిల్దార్ ధారావత్ లాలూ నాయక్ పాల్గొన్నారు .నాజిపురం రైతు వేదికలో రైతులు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి తొమ్మిది రోజుల లోపు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతది అని ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు కే.మురళి, పి. ప్రణయ్, చైతన్య, శ్రావణి, రైతు సోదరులు సముద్రాల శ్రీనివాస్, షేక్ జాన్ మియా, మాధవరావు, జూకూరు గాంధీ, కోక ఉసేన్, దొంగరి కనకయ్య, నల్లపు శ్రీరాములు, టి రవీందర్ ,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
-
Nalgonda : వీడు మామూలోడు కాదు.. బంగారం పేరుతో ఘరానా మోసం..!
-
Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)
-
Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!









