Cultivation : దుక్కులు రెడీ.. వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతులు..!
Cultivation : దుక్కులు రెడీ.. వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతులు..!
చింతపల్లి, మన సాక్షి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిశాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వానాకాలం పంటలకు సిద్ధమయ్యారు. దుక్కులు దున్నుకొని విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఇటీవల కురిసిన మోస్తారు వర్షాలకు రైతులు భూములను దుక్కి దున్ని చదును చేసుకున్నా రు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభ కావడంతో రైతులు తమ పంట పొలాల్లో పత్తి విత్తనాలను నాటేందుకు ముందుగానే పత్తి గింజలను కొనుగోలు చేసుకున్నారు. గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి రైతులు చదును చేసుకున్న పంట పొలాల్లో పత్తి గింజలను పెట్టారు.
దీంతో ఇటు రైతులు, అటు కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతోపాటు వరి పంటను వేసేందుకు బోరు బావల కింద తుకాలను కూడా పోశారు. రోహిణి కార్తె వెళ్లకముందే పంటలు వేసినట్లయితే సమృద్ధిగా పంటలు పండుతాయని రైతులు పొడి పదనులోనే భూమిపై పత్తి గింజలు పెట్టారు.
మండలంలో కొన్ని గ్రామాల్లో 40 శాతానికంటే పైగా వర్షం కురవడంతో రైతులు విత్తిన పత్తి విత్తనాలు మొలకలు ఎత్తాయి. దీంతో రైతులు ఆనందంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కూలీలతో పనులు చేయించుకుంటున్నారు.
అదేవిధంగా మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు బారు లు తీరారు. రైతులు తమ పంట పొలాలకు కూలీలకు డబ్బులు చెల్లించేందుకు రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారు.
By : Venkateshwarlu, Chinthapally
MOST READ :
-
Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!
-
Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!
-
District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!









