Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఆర్టీసీ బస్సుకు నిప్పు.. అర్ధరాత్రి ఘటన..!

Miryalaguda : ఆర్టీసీ బస్సుకు నిప్పు.. అర్ధరాత్రి ఘటన..!

మన సాక్షి , మిర్యాలగూడ :

నల్లగొండ జిల్లా లో ఆర్టీసీ బస్సుకు అర్ధరాత్రి నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో నైట్ హాల్ట్ మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మిర్యాలగూడ డిపోకు చెందిన TS 05 Z 0047 నెంబర్ బస్సు ఆ గ్రామంలోని కూడలిలో రోజు మాదిరిగానే నైట్ హాల్ట్ పార్క్ చేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు బస్సుకు నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన బస్ డ్రైవర్, కండక్టర్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బస్సులో మంటలను ఆర్పేశారు. కాగా బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసం అయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Hyderabad : శంషాబాద్ లో దారుణం.. పదేళ్ల చిన్నారి పై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు..!

మరిన్ని వార్తలు