TGSRTC : సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు..!
TGSRTC : సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు..!
సూర్యాపేట, మనసాక్షి :
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 400ల ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట కొత్త బస్టాండ్లో చేపట్టిన బస్టాండ్ ఆవరణ ఫ్లోరింగ్ తో పాటు మహాలక్ష్మి టాయ్లెట్స్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
సంక్రాంతి పండుగకు సూర్యాపేట నుంచి హైద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడెం పట్టణాలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీసీ డిపోల్లో రోడ్డు బద్రత వారోత్సవాలు నిర్వహిస్తూ ఆర్టీసి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలకు ఆర్టీసి బస్సు వెళ్ళేలా డ్రైవర్ల ఫిట్మెంట్ అనంతరం విడుతల వారీగా గ్రామాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకొని భద్రతతో కూడిన సురక్షిత ప్రయాణం చేసి తమ స్వగ్రామాలకు చేరుకోవాల్సిందిగా కోరారు.
ఆయన వెంట డిపో మేనేజర్ సురేందర్, సీఐ సైదులు, ఎఈ కిరణ్, ఎల్బీ ప్రభాకర్, ఆర్.వి.సింగ్, వెల్ఫేర్ బోర్డు సభ్యులు యూసుఫ్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!
-
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం.. సూపర్ చెక్ సర్వే..!
-
Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!









