TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎకరం సాగుచేసిన రైతులకు 12 వేల రూపాయలను రెండు విడతలుగా పెట్టుబడి సహాయంగా అందజేస్తారు. కాగా ఈ పథకం పై వానాకాలం సీజన్ కు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈనెల 25 లోపు రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. ఎకరానికి 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయంగా 10వేల కోట్ల రూపాయలను అందించబోతున్నట్లు చెప్పారు.

ఈసారి రైతు భరోసా నిబంధనల ప్రకారం 54 ఎకరాల మెట్ట ఉన్న రైతులకు కూడా అందిస్తామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 18 ఎకరాలు, చెరువుల కింద 27 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు రైతులు 87% వరకు ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన అర్హత ఉన్న వ్యవసాయ కూలీలకు కూడా ప్రభుత్వం సహాయం అందజేస్తుందని చెప్పారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

  2. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

  3. Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  6. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు