వరి కొయ్యలకు నిప్పు పెడుతూ…  రైతు మృతి

వరి కొయ్యలకు నిప్పు పెడుతూ…  రైతు మృతి

మునగాల, మనసాక్షి

వరికొయ్యలు తగలబెడుతుండగా దట్టమైన పొగ కమ్ముకొని ప్రమాదవశాత్తు ఓ రైతు మరణించిన సంఘటన మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. మునగాల ఎస్సై పి. లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం…

మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన చామకూరి సత్యనారాయణ (65) మంగళవారం ఉదయం తన పొలంలో వరికొయ్య కాలు కాల్చుటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలానికి వెళ్ళాడు. పొలంలోని వరి కొయ్యలు కాల్చుస్తుండగా, అట్టి మంటలు పక్క పొలానికి అంటుకోగా వాటిని చల్లారితే ప్రయత్నంలో మంటలు, దట్టమైన పొగ చుట్టుముట్టి ఊపిరాడక చనిపోయాడు.

 

మృతుని కుమారుడు చామకూరి కాశీపతి తన తండ్రిని వెతుకుతూ పొలం దగ్గరికి వెళ్లి చూడగా తన తండ్రి కాలిన గాయాలతో మృతి చెంది ఉన్నాడని, మృతుని కుమారుడు కాశీపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై లోకేష్ తెలిపారు.