వేములపల్లి : రైతు వేదికలో పండుగ వాతావరణం

రైతు వేదికలో పండుగ వాతావరణం

ర్యాలీలో పాల్గొన్న శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు

వేములపల్లి , మన సాక్షి

తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వేములపల్లి మండల కేంద్రంలో ఏవో ఋసేంద్రమని, గ్రామ సర్పంచ్, చీర్ర మల్లయ్య యాదవ్, ఎమ్మార్వో వెంకటేశం, ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

 

రైతులందరూ తమ టాక్టర్లతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ట్రాక్టర్లకు తోరణాలు, పూలతో అలంకరించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు హాజరయ్యారు అనంతరం బస్టాండ్ నుండి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని రైతు వేదిక వద్దకు చేరుకున్నారు.

 

రైతు సభ వేదికలో ఏడి నాగమణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి, ఉచిత కరెంటు మరియు పంటల పెట్టుబడి సాయం రైతుబంధు పథకం అమలు తర్వాత క్లస్టర్ స్థాయిలో పంటలు సాగు గణనీయంగా పెరగడం జరిగింది జరిగినది. వరి పంటలు రికార్డు స్థాయిలో సాగు చేయడమే కాక దిగు దిగుబడులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం జరిగినది.

 

క్లస్టర్లో 80 శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడే వారు కావడంతో పంటలు సాగువలన రైతులకు ఆదాయం గణనీయంగా పెరిగింది. పంటలు రికార్డు స్థాయిలో సాగు చేయడమే కాక దిగుబడులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం జరిగినది.

 

కొత్త ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్, సాగర్ ప్రాజెక్టు ద్వారా రెండు కార్లకు నీరు అందించడం 24 గంటల ఉచిత కరెంటు ద్వారా క్లస్టర్ తొమ్మిది వేల ఎకరాల సాగవగా 2023 లో 11 ఎకరాలు సాగైనది ఎకరాల సాగు అయినది 20 ఎకరాల 2000 ఎకరాల అదనపు విస్తీర్ణం సాగులోకి వచ్చినది. అధిక విస్తీర్ణంలో పంటలు సాగవ్వడం వలన రైతులకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది.

 

రైతుబంధు పథకం :

రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులకు ప్రభుత్వం పెట్టుబడి రూపేణ ప్రతి వ్యవసాయ సీజనులో ఎకరానికి 5000 ఇస్తుంది. సంవత్సరానికి ఎకరానికి రెండు సీజన్లకు (వానకాలం& యాసంగి) కలిపి 10000 ఇస్తుంది. వీటిని నేరుగా రైతు ఖాతాలో సీజన్ కు ముందు జమ చేయబడతాయి.తద్వారా రైతు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేసి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయడం ఈ పథకం రైతులకు ఉపయోగపడింది.

 

రైతు బీమా పథకం :

రైతు బీమా పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల బీమా చేయబడుతుంది. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఎల్ఐసి సంస్థ ద్వారా రైతు నమోదు చేసుకున్న నామినేకి 5 లక్షల రూపాయలు చెల్లించబడుతుంది.

 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం :

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు 60% సబ్సిడీ మీద పచ్చిరొట్టె, విత్తనాలు, జీలుగు, జినుము మరియు పంట విత్తనాలు ఎరువులు తక్కువ ధరలకు రైతులకు అందిస్తున్నారు.

 

ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , రాములు గౌడ్, ఎస్ సి ఎల్ ఏ డి శాంత నిర్మల, ఏ ఈ ఓ నితిన్, రైతు సమన్వయ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగవెల్లి శంకర్, మండల నాయకులు, శేఖర్ రెడ్డి, గుండెబోయిన లక్ష్మయ్య, పుట్టల పౌలు, నకరికంటి కిషోర్, బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.